ETV Bharat / state

ఆశాదీపాలు.. ఆరోగ్య ప్రదాతలు.. - AASHA WORKERS PROBLEMS

ఇంటింటికి వస్తారు.. ఆరోగ్యంపై ఆరా తీస్తారు. ప్రాణాలు పణంగా పెట్టి పనిలో తలమునకలవుతున్నారు. భయాన్ని బయటపెట్టకుండా భద్రతకు పెద్దపీట వేస్తున్నారు. ఆపత్కాలంలో అనునిత్యం ప్రజారోగ్యం కోసం శ్రమిస్తున్నారు... వారే ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు. కరోనా కట్టడికి నిత్యం కష్టపడుతున్నఆశాజ్యోతుల గోడు వారి మాటల్లోనే...

AASHA WORKERS DAILY ROUTINE IN LOCK DOWN TIME
ఆశాదీపాలు.. ఆరోగ్య ప్రదాతలు..
author img

By

Published : Apr 28, 2020, 9:14 AM IST

కేవలం పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాల్లోనే కాకుండా సాధారణ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు ఆశా కార్యకర్తలు. ఏ కుటుంబంలోనైనా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతుంటే వారి పూర్తి సమాచారం సేకరించి వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నారు. ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాల్లో సర్వే కత్తిమీద సాముగా మారిందని సిబ్బంది చెబుతున్నారు. సర్వేకు ఇంటింటికి వెళ్లినప్పుడు కొందరు వివరాలు తెలియజేయడం లేదని చెబుతున్నారు. చాలామంది ఇళ్ల ప్రాంగణంలోకి రానివ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

‘కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాల్లో సర్వేకు వెళుతున్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా. ఇంట్లో నాకు వేరుగా గది కేటాయించారు. కుటుంబీకులతో కలవకుండా విడిగా ఉంటున్నా. పిల్లలను దగ్గరకు తీసుకోలేకపోతున్నా. దుస్తులు ఉతుక్కోవడం నుంచి అంతా ఎంతో జాగ్రత్తగా చేసుకుంటున్నా. నాతో పాటు కుటుంబీకుల ఆరోగ్యం ఇబ్బందిపెట్టకుండా వారికి ఎడంగా ఉంటున్నా’ అంటూ... ప్రాణాలకు తెగించి శ్రమిస్తోన్న ఓ ఆశా కార్యకర్త తన రోజువారి కార్యక్రమాన్ని తెలియజేశారు.

ప్రయాణానికి ఇబ్బందులు

ఆరోగ్య సిబ్బంది సర్వే ప్రాంతానికి చేరుకునేందుకు ప్రయాణానికి ఇబ్బందులు పడుతున్నారు. గ్రామం లేదా కాలనీలో ఇంటింటికి ఉదయం నుంచి సాయంత్రం వరకు కాలినడకన వెళ్లి వివరాలు సేకరించాల్సి ఉంది. ఈలోపు ఆయా కాలనీలకు ఇంటి నుంచి వచ్చేందుకు ప్రయాణ సదుపాయాలు ఉండటం లేదు. కేవలం సంయుక్త సర్వే జరిగినప్పుడు మాత్రం 104 వాహనాలు తీసుకొచ్చి, తీసుకెళుతున్నారు. మిగిలిన సమయంలో వారే సొంత వాహనాల్లోనే సర్వే ప్రాంతానికి చేరుకోవాల్సి వస్తోంది.

మాస్కులు.. మాత్రలు

ఆపత్కాలంలో శ్రమకోర్చి పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఆశావర్కర్లకు ఇస్తున్న రూ.7500కు అదనంగా ప్రస్తుతం మరో రూ.వేయి ఇస్తోంది. మార్చిలో పెంచిన వేతనాలు పంపిణీ చేసింది. మరోవైపు ఏఎన్‌ఎంలుగా పనిచేస్తున్న వారిలో ఎక్కువగా ఒప్పంద ఉద్యోగులే. తమ ఉద్యోగాలు రెగ్యులర్‌ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆరోగ్య సిబ్బంది రక్షణకు జాగ్రత్తలను ప్రభుత్వం తీసుకుంటోందని వైద్యారోగ్యశాఖాధికారులు చెబుతున్నారు. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలు అందించడంతోపాటు ప్రతి పీహెచ్‌సీకి 20వేల మాస్కులు, 25లీటర్ల శానిటైజర్లను అందించినట్లు వివరించారు. పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాల్లో సర్వే చేస్తున్న వారికి ఎన్‌-95 మాస్కులు, గ్లౌజులు అందించాలని సిబ్బంది కోరుతున్నారు.

* ‘ఉదయం 6 గంటలకల్లా సర్వేలో పాల్గొనేందుకు రావాలి.. సాయంత్రం వరకు ఇంటింటికి తిరగాలి. కాలనీల్లో అపార్టుమెంట్లలో ప్రతి ఫ్లోరూ.. ఎక్కి దిగాలి. ఎంతో కష్టపడి వెళ్తే కొందరు ఇంటి యజమానులు వివరాలేవీ చెప్పకుండా సతాయిస్తారు. ఇంటి నుంచి సర్వే జరిగే ప్రాంతానికి వెళ్లాలన్నా ప్రయాణానికి అవస్థలు పడుతున్నాం.’ అంటూ సర్వేలో పాల్గొన్న ఓ ఆశా కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.