ETV Bharat / state

స్నేహితుడి చేతిలో మరో యువకుడు బలి..!

Young Person Murder in Hyderabad: హైదరాబాద్​లో హత్య ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. చాలాచోట్ల స్నేహితులే యమపాశమవుతున్నారు. ప్రేమ వల్ల కొందరు.. మోసం చేశారని మరికొందరు.. పాత కక్షలతో ఇంకొందరు ఇలా రకరకాల కారణాలతో స్నేహంగా ఉంటూ నమ్మకంగా మెలుగుతూ అదనుచూసి ఊపిరి తీస్తున్నారు. హైదరాబాద్​లో నిన్న వెలుగులోకి వచ్చిన అబ్దుల్లాపుర్​మెట్ ఘటన ఇంకా మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

Young Boy Murder in Hyderabad
Young Boy Murder in Hyderabad
author img

By

Published : Feb 26, 2023, 12:46 PM IST

Young Person Murder in Hyderabad: హైదరాబాద్​ నగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. తను ప్రేమించిన అమ్మాయిని ఇష్టపడుతున్నాడని.. తన ప్రేమకు అడ్డొస్తున్నాడని.. ఓ యువకుడు తన స్నేహితుడిని దారుణంగా చంపిన ఘటన మరవక ముందే మరో ఉదంతం ఆలస్యంగా వెలులోకి వచ్చింది. మరో యువకుడు తన స్నేహితుడి చేతిలో బలైనట్లు తెలుస్తోంది. కాకపోతే ఇక్కడ కారణం ప్రేమ, ప్రేయసి కాదు పాతకక్షలు, ఆర్థిక లావాదేవీలు.

ఏళ్ల తరబడి స్నేహంగా ఉంటూ చిన్నచిన్న గొడవలతో కక్ష పెంచుకుని శత్రువులుగా మారుతున్నారు కొందరు. ఆ శత్రుత్వం చివరకు ప్రాణం తీసేలా చేస్తోంది. ఏళ్ల నుంచి ఉన్న స్నేహబంధం వారి ప్రాణాలను కాపాడలేకపోతోంది. అలాంటి ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది. స్నేహంగా ఉంటూనే ఏళ్ల తరబడి ఉన్న పగను అదనుచూసి బయటపెట్టాడు ఓ యువకుడు. నమ్మకంగా ఉంటూ చివరకు స్నేహితుడినే మట్టుబెట్టాడు.

హైదరాబాద్‌ పాతబస్తీ ఉస్మాన్‌నగర్‌కు చెందిన మహ్మద్ జాఫర్ కుమారుడు.. మహ్మద్‌షా ఫైసల్‌(25) ఈ నెల 12న ఇంటి నుంచి బయటకు వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. తల్లిదండ్రులు అతని ఆచూకీ కోసం గాలించారు. అయినా యువకుడి జాడ లభించక పోవడంతో, చివరికు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై 13వ తేదీన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. శనివారం రాత్రి మినార్ కాలనీ సమీపంలో ఫైసల్‌ మృతదేహాన్ని గుర్తించారు.

అదృశ్యమైన రోజే అతను హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఫైసల్​పై కర్రలు, రాళ్లతో దాడి చేసి హత్య చేసినట్టు ప్రాథమికంగా తెలిపారు. ఈ వ్యవహారంలో అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పాతకక్షలు, ఆర్ధిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మినార్ కాలనీలోని ఖాళీగా ఉన్న ఓ ఇంటి ఆవరణలో ఫైసల్​ను హత్య చేసి దుర్వాసన రాకుండా మృతదేహంపై మట్టి పోసి నిందితుడు వెళ్లిపోయాడని చెప్పారు. ఈ హత్య చేసింది ఫైసల్ స్నేహితుడేనని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడికి దాదాపు 6 నెలల క్రితం వివాహం జరిగిందని తెలిపారు. చేతికొచ్చిన కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. నిందుతులను ఎవరైనా కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.