ETV Bharat / state

KTR: కేటీఆర్​ సార్​... నా బిర్యానీలో లెగ్​పీస్​ రాలేదు

author img

By

Published : May 28, 2021, 7:40 PM IST

Updated : May 28, 2021, 8:05 PM IST

ఆన్​లైన్​లో బిర్యానీ ఆర్డర్​ చేసిన ఓ వ్యక్తి... తనకొచ్చిన పార్శిల్​లో లెగ్​పీసులు (leg piece) లేవంటూ మంత్రి కేటీఆర్​ను ట్యాగ్​ చేస్తూ ట్వీట్​ చేశాడు. దీనిపై మంత్రి స్పందించారు.

A person who tagged KTR
A person who tagged KTR

ఓ వ్యక్తికి పగవాడికి కూడా రాని కష్టం వచ్చింది. తనకు కలిగిన బాధను ఎవరితో పంచుకోవాలో తెలియని పరిస్థితి. విపత్కాలంలో నేనున్నానంటూ కనిపించే మంత్రి కేటీఆర్(KTR)​ గుర్తొచ్చారు. ఇంకేముంది తనకు కలిగిన ఇబ్బందిని గురించి మంత్రి కేటీఆర్​కు ట్యాగ్​ చేస్తూ ట్వీట్​(Tweet) చేశాడు. ఇంతకీ అతనికొచ్చిన ఇబ్బందేమిటంటే..

తోటకూరి రఘుపతి అనే వ్యక్తి ఆన్​లైన్​లో బిర్యాని ఆర్డర్​ చేశాడు. చికెన్​ బిర్యాని విత్​ఎక్స్​ట్రా మసాలాతో(Biryani with extra masala) పాటు లెగ్​ పీసులను ఆర్డర్​ చేశాడు. అయితే తనకొచ్చిన పార్శిల్​లో ఇవేమీ కనిపించలేదు. అసలే ఆకలితో ఉన్నాడేమో కడుపు మండిపోయింది. ఎక్స్​ట్రా మసాలా ఆర్డర్​ ఇస్తే ఒట్టి బిర్యానీ ఇచ్చి పోతారా అని కుతకుతలాడిపోయాడు. ఏమి చేయాలో తెలియక ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్​కు ట్యాగ్​ చేస్తూ ట్వీట్​ చేశాడు. ప్రజలకు ఇలాంటి సేవలు అందించడం ఏంటని ఉక్రోసాన్ని వెళ్లగక్కాడు.

అతడి ట్వీట్​పై స్పందించిన మంత్రి ఈ విషయంలో నేనేమి చేయగలను బ్రదర్​... నా నుంచి నీవు ఏం ఆశిస్తున్నావని ప్రశ్నించారు. కేటీఆర్​ ట్వీట్​ తర్వాత... ఆ వ్యక్తి తాను చేసిన ట్వీట్​ను తొలగించాడు.

tweet
ట్వీట్​

Last Updated : May 28, 2021, 8:05 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.