ETV Bharat / state

కుటుంబ సభ్యుల చెంతకు మతిస్తిమితం కోల్పోయిన వ్యక్తి

మతిస్తిమితం కోల్పోయిన ఓ వ్యక్తిని మాతృదేవోభవ ఆశ్రమం అతని కుటుంబ సభ్యుల చెంతకు చేర్చనుంది. ఒడిశా నుంచి హైదరాబాద్​ వచ్చిన ఆ వ్యక్తిని మాతృదేవోభవ ఆశ్రమం చేరదీసింది. ఈటీవీ భారత్ సహయంతో కుటుంబ సభ్యులకు అప్పగించనుంది.

A person who has lost the insanity of going to family members soon with help of etv bharat
కుటుంబ సభ్యుల చెంతకు మతిస్తిమితం కోల్పోయిన వ్యక్తి
author img

By

Published : Oct 7, 2020, 4:48 AM IST

ఉపాధి కోసం ఒడిశా నుంచి హైదరాబాద్​కు వచ్చిన ఓ వ్యక్తికి లాక్​డౌన్ సమయంలో పనులు లేక ఇబ్బంది పడ్డాడు. మానసిక ఒత్తిడికి గురై మతిస్తిమితం కోల్పోయాడు. బాలాపూర్, ఆర్​సీఐ, విజ్ఞాన్ కంచ్​లో అనుమానాస్పదంగా తిరుగుతున్న అతడిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు అతన్ని నాదర్​గుల్​లోని మాతృదేవోభవ అనాథ ఆశ్రమంలో చేర్పించారు.

అతనికి వైద్యం అందించారు. కొన్ని రోజుల తర్వాత ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు గిరి అతని గురించి వాకబు చేయగా తన పేరు అర్జున్​ అని వయసు 26 సంవత్సరాలని.. తన స్వస్థలం ఒడిశాలోని కొరపూట్​ జిల్లా దలియమ్​ గ్రామమని చెప్పాడు. గిరి వెంటనే స్థానిక ఈటీవీ భారత్ ప్రతినిధికి ఇతని వివరాలను అందించారు. ఈటీవీ భారత్ ప్రతినిధి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. యువకుడి ఫొటోను కుటుంబ సభ్యులకు పంపించటంతో అతనిని గుర్తుపట్టారు. అర్జున్​ తీసుకెళ్లెందుకు త్వరలో హైదరాబాద్​ రానున్నారు.

ఇదీ చదవండి: గుండెపోటుతో క్రికెటర్​ మృతి.. అశ్విన్​ సంతాపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.