కర్నూలు జిల్లా నంద్యాలలో మద్యానికి బానిసైన ఓ వ్యక్తి.... భార్య డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్యకు యత్నించాడు. నంద్యాల చాంద్ బడాకు చెందిన అబ్దుల్ సలాం ఓ వ్యాపార దుకాణంలో దినసరి కూలీగా పని చేస్తున్నాడు. ఆదివారం మద్యం తాగాలని తన భార్యను రూ.50 అడిగాడు. ఆమె ఇవ్వకపోవటంతో బ్లేడ్‌తో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.
ఇదీచూడండి.'రాయలసీమలో ఫ్యాక్షన్ తగ్గిపోయింది'