ETV Bharat / state

కుమారుడు ప్రేమించాడు.. తండ్రి తాళి కట్టాడు.. - A women raped by his lover father

ఓ యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటే ఆమెనే చేసుకుంటానని ఇంట్లో చెప్పేశాడు. ప్రేమికులిద్దరిని ఎలాగైనా విడదీయాలని యువకుని తండ్రి ప్లాన్ వేశాడు. పెళ్లి గురించి మాట్లాడదామని యువతిని రమ్మని పిలిచి మెడలో తాళి కట్టాడు. రెండ్రోజులు ఇంట్లో నిర్బంధించి లైంగిక వాంఛ తీర్చుకున్నాడు.

A man raped to his son lover in tamilanadu
కుమారుడు ప్రేమించాడు.. తండ్రి తాళి కట్టాడు..
author img

By

Published : Feb 1, 2020, 12:54 PM IST

కొడుకునిచ్చి పెళ్లి చేయవలసిన యువతిపైనే ఒక వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడిన దిగ్ర్భాంతికర సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. నిత్యానందం అనే వ్యక్తి వేదారణ్యంలో బట్టల దుకాణం నడుపుతున్నాడు. ఆయన కుమారుడు ఎన్‌.ముకేశ్‌ కన్నన్‌, ఓ యువతి ప్రేమించుకున్నారు. ఇది నచ్చని నిత్యానందం వారిని ఎలాగైనా విడదీయాలని నిర్ణయించుకున్నాడు.

మాట్లాడదామని రమ్మన్నాడు

వివాహం గురించి మాట్లాడటానికి కొడుకు ప్రేమించిన యువతిని పిలిపించాడు. ఆమె ఇంటికి రాగానే ఫోన్‌ లాక్కున్నాడు. ఆ వెంటనే మంగళసూత్రాన్ని ఆమె మెడలో కట్టాడు. అక్కడితో ఆగని ఆ దుర్మార్గుడు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. రెండురోజుల పాటు తన ఇంట్లోనే నిర్బంధించి లైంగిక దాడి చేశాడు. ఆపై ఆమెను తన స్నేహితుడి ఇంట్లో దాచాడు.

విషయం తెలుసుకున్న కన్నన్‌..తన ప్రియురాలిని రక్షించాడు. తన తండ్రి చేసిన ఘాతుకంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగపట్టిణం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

ఇదీ చూడండి : ఎడ్లబండ్లకు కూడా రేడియం స్టిక్కర్స్ అంటించుకోవాలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.