ఎల్బీనగర్లో విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో మంచాల మండలం లోయపల్లికి చెందిన నరేందర్ గౌడ్ ఫ్లై ఓవర్పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతోనే నరేందర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు.
ఇదీ చదవండి:మారుతున్న తీరు.. రెండో పెళ్లికి సై అంటున్నారు వీరు.