ETV Bharat / state

108 కేటీఆర్​ ముఖ చిత్రాలు గీశాడు.. రికార్డు తిరగరాశాడు - కేటీఆర్​ తాజా వార్తలు

మంత్రి కేటీఆర్​పై 108 ముఖ చిత్రాలను గీసి తన అభిమానాన్ని చాటుకున్నాడు ఓ అభిమాని. కేటీఆర్​ జన్మదినం సందర్భంగా ఈ చిత్రాలు గీసి ఆకట్టుకున్నాడు. దీంతో ముంబయికి చెందిన డాక్టర్​ రాజేంద్ర కాంతక్​ గీసిన 101 చిత్రాల రికార్డును తిరగరాశాడు. గతంలో కూడా అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాపై పెన్సిల్​ స్కెచ్​ వేసి ప్రశంసలందుకున్నారు ఆ ప్రవాస భారతీయుడు.

108 కేటీఆర్​ ముఖ చిత్రాలు గీశాడు.. రికార్డు తిరగరాశాడు

author img

By

Published : Jul 20, 2020, 8:25 PM IST

Updated : Jul 20, 2020, 9:10 PM IST

108 కేటీఆర్​ ముఖ చిత్రాలు గీశాడు.. రికార్డు తిరగరాశాడు

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​పై అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుడు అరవింద్ ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. ఈ నెల 24న కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కేటీఆర్​పై 108 ముఖచిత్రాలు గీసి ఔరా అనిపించారు. హైదరాబాద్​లోని అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన అరవింద్... అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు.

అరవింద్​కు చిత్రలేఖనమంటే ప్రత్యేక ఆసక్తి. ఈ క్రమంలోనే గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాపై పెన్సిల్ స్కెచ్ వేసి ప్రశంసలందుకున్న అరవింద్.. తాజాగా కేటీఆర్​పై 108 ముఖ చిత్రాలు గీసి సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో ముంబయికి చెందిన డాక్టర్ రాజేంద్ర కాంతక్ అనే చిత్రకారుడు బాల్ థ్రాకేపై 101 చిత్రాలు గీసి రికార్డు నెలకొల్పగా.. అరవింద్ కేటీఆర్​పై 108 చిత్రాలు గీసి ఆ రికార్డును తిరగరాశారు.

ఆ చిత్రాలన్నింటిని హైదరాబాద్​లో కేటీఆర్​కు పుట్టినరోజు కానుకగా అందజేయనున్నట్లు అరవింద్ వెల్లడించారు.

ఇదీ చదవండి: నరకయాతన: అద్దె ఇళ్లలో ఉండనివ్వరు.. దవాఖానాల్లో చేర్చుకోరు!

Last Updated : Jul 20, 2020, 9:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.