హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఓ 70 మంది విద్యార్ధులు 'హెచ్హెచ్ఎన్ ఫౌండేషన్' పేరిట ఓ బృందంగా ఏర్పాడ్డారు. లాక్డౌన్తో ఉపాధి కరవై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేస్తూ అండగా నిలుస్తున్నారు. గతేడాది లాక్డౌన్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి.. రెండో దశ లాక్డౌన్లోనూ నిరుపేదలను ఆదుకుంటున్నారు. తమకు తోచిన సాయమందిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
లాక్డౌన్ కారణంగా రోజువారి కార్మికుల జీవనం దుర్భరంగా మారిందని ఫౌండేషన్ అధ్యక్షుడు సాయి వికాస్ అన్నారు. రెండేళ్లుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. నిత్యావసరాలతో పాటు రోడ్ల పక్కన నివసించే వారికి దుప్పట్లు, ఆన్లైన్ తరగతులు వినలేని నిరుపేదల పిల్లలకు చరవాణులు పంపిణీ చేసినట్లు తెలిపారు. విద్యార్థి దశ నుంచే సమాజ సేవ చేయడం తమకెంతో సంతృప్తికరంగా ఉందన్నారు.
ఇదీ చదవండి: ఆ చిన్నారుల సంరక్షణకు కేంద్రం మార్గదర్శకాలు