Fashion Show in hyderabad: ఆడపిల్లల సాధికారత కోసం సేవా అనే స్వచ్చంద సంస్థ హైదరాబాద్‌లో నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. పలువురు అందాల రాణులు చిన్నారులకు మద్దతుగా నిలిచారు. చిన్నారులతో కలిసి పలువురు మిసెస్ ఇండియాలు ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేస్తూ అదరహో అనిపించారు. ప్రతి అమ్మాయికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, నేటి ఆడపిల్లకు సాధికారత లభిస్తేనే రేపటి సమాజంలో వారి పాత్ర ఎంతో ఉంటుందని సేవా సంస్థ వ్యవస్థాపకురాలు మమతా త్రివేది అన్నారు.
ఈ ఆలోచనతోనే బాలానగర్‌లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను దత్తత తీసుకున్నామని సేవా సంస్థ వ్యవస్థాపకురాలు మమతా త్రివేది తెలిపారు. భ్రూణహత్యలు, బాల్యవివాహాలు, పోషకాహార లోపం, అక్రమ రవాణా తదితర అంశాలపై తమ సంస్థ అవగాహన కల్పిస్తుందన్నారు. వీటితో పాటు మానసిక ఆరోగ్యం, పిల్లల భద్రత మొదలైన అనేక సమస్యలపై పని చేస్తోందని వివరించారు. ఈ నేపథ్యంలోనే ఆడపిల్లల సాధికారతకు అండగా నిలిచేందుకు ఈ ఫ్యాషన్ వాక్‌ను నిర్వహించినట్లు చెప్పారు.
ఇవీ చూడండి: పోలవరం ప్రాజెక్టు భూసేకరణలో అక్రమాలు.. పరిహారమంతా దళారుల పాలు..