ETV Bharat / state

నవభారత్‌ నిర్మాణానికి కంకణబద్ధులమవుదామన్న వెంకయ్యనాయుడు - Independence Day Live Updates

75th Independence Day Live Updates in telangana
రాష్ట్రంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
author img

By

Published : Aug 15, 2022, 8:37 AM IST

Updated : Aug 15, 2022, 12:35 PM IST

12:34 August 15

కేంద్ర ప్రభుత్వం సమాఖ్య విలువలకు తూట్లు పొడుస్తోంది: సీఎం

  • కేంద్ర ప్రభుత్వం సమాఖ్య విలువలకు తూట్లు పొడుస్తోంది: సీఎం
  • రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపర్చాలని కేంద్రం కుట్ర: సీఎం
  • పన్నుల రూపంలో చెల్లించే దాంట్లో రాష్ట్రాలకు 41 శాతం వాటా ఇవ్వాలి: సీఎం
  • పన్నుల వాటాలను కుదించాలని కేంద్రం యత్నం: సీఎం
  • సెస్సుల రూపంలో కేంద్రం దొడ్డిదారిన ఆదాయం సముపార్జన : సీఎం
  • 2022-23లో రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయంలో 11.4 శాతం గండి: సీఎం
  • రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీస్తూ ఆంక్షలు విధిస్తోంది: సీఎం
  • ఎఫ్‌ఆర్‌బీఎం కింద తీసుకునే రుణాల్లో కేంద్రం కోతలు: సీఎం
  • అధికారాల కేంద్రీకరణకు కేంద్రం యత్నం: సీఎం
  • నిత్యావసరాలపై పన్నులు విధిస్తూ ప్రజలపై భారం మోపుతున్నారు: సీఎం
  • ప్రజా సంక్షేమం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత: సీఎం
  • కేంద్రం తన బాధ్యత సరిగా నిర్వర్తించట్లేదు: సీఎం
  • సంక్షేమ పథకాలకు 'ఉచితాలు' అని పేరు పెట్టి అవమానిస్తోంది: సీఎం
  • కేంద్ర అసమర్థ పాలన వల్ల దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడింది: సీఎం
  • ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకాయి: సీఎం
  • రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా పడిపోయింది: సీఎం
  • కేంద్ర పెద్దలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు యత్నం: సీఎం
  • విద్వేష రాజకీయాలతో నీచ ఎత్తుగడలకు పాల్పడుతున్నారు: సీఎం

12:03 August 15

నవభారత్‌ నిర్మాణానికి కంకణబద్ధులమవుదాం: వెంకయ్యనాయుడు

  • హైదరాబాద్‌లోని నివాసంలో జాతీయ జెండా ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
  • స్వరాజ్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి: వెంకయ్యనాయుడు
  • జాతిని సంఘటితం చేసే ప్రేరణాత్మక శక్తి మువ్వన్నెల జెండా: వెంకయ్యనాయుడు
  • నవభారత్‌ నిర్మాణానికి కంకణబద్ధులమవుదాం: వెంకయ్యనాయుడు
  • సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కొందాం: వెంకయ్యనాయుడు
  • ఆత్మనిర్భర్‌ భారత్ వైపు పురోగమిద్దాం: వెంకయ్యనాయుడు

11:01 August 15

బలీయమైన ఆర్థికశక్తిగా తెలంగాణ ఎదిగిందన్న సీఎం

  • విద్యుత్‌ కోతలు విధించని ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది: సీఎం
  • వేసవిలోనూ అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందించాం: సీఎం
  • విద్యుత్‌ రంగంలో సమూల మార్పుల వల్లే విజయం సాధ్యమైంది: సీఎం
  • తలసరి విద్యుత్‌ వినియోగంలోనూ తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది: సీఎం
  • మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నాం: సీఎం
  • వంద శాతం ఆవాసాలకు తాగునీరు అందించగలిగాం: సీఎం
  • ఫ్లోరైడ్‌ రహిత రాష్ట్రంగా మారిందని కేంద్రం కొనియాడింది: సీఎం

11:01 August 15

  • కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ ద్వారా ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం: సీఎం
  • పథకం కింద 11.24 లక్షల మందికి రూ.9716 కోట్లు ఖర్చు: సీఎం
  • గొల్ల, కుర్మలకు పెద్దఎత్తున గొర్రెల పంపకం చేస్తున్నాం: సీఎం
  • గొర్రెల పెంపకంలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది: సీఎం
  • రాష్ట్రంలో మాంస ఉత్పత్తి పెరిగి గులాబీ విప్లవం సాధ్యమైంది: సీఎం
  • జాలర్లకు చేప పిల్లల పంపకం ద్వారా నీలి విప్లవం సాధించాం: సీఎం
  • గౌడ సోదరులకు మద్యం దుకాణాల్లో 15 శాతం రిజర్వేషన్లు: సీఎం
  • దోబీ ఘాట్లు, లాండ్రీలు, సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌: సీఎం
  • వివిధ వృత్తుల ఆదాయం గణనీయంగా పెరిగేందుకు దోహదం: సీఎం
  • నేతన్నకు బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నాం: సీఎం
  • నేత కార్మికుడు మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం: సీఎం

10:47 August 15

సంక్షేమంలో దేశంలో నంబర్‌ వన్‌గా తెలంగాణ నిలిచింది: సీఎం

  • తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది: సీఎం
  • ప్రతి వర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం: సీఎం
  • సంక్షేమంలో దేశంలో నంబర్‌ వన్‌గా తెలంగాణ నిలిచింది: సీఎం
  • నేటి నుంచి మరో 10 లక్షల మందికి ఆసరా పథకం కింద పింఛన్లు: సీఎం
  • రాష్ట్రంలో ఆసరా పింఛన్లు 46 లక్షలకు చేరుతాయి: సీఎం
  • దేశంలో ఎస్సీ వర్గం పట్ల నేటికీ వివక్ష కొనసాగుతోంది: సీఎం
  • ఎస్సీ వర్గాలు వెనుకబాటుకు చిరునామాలుగా మారుతున్నాయి: సీఎం
  • ఎస్సీల అభివృద్ధే ధ్యేయంగా దళితబంధు పథకం తెచ్చాం: సీఎం
  • దళితబంధు పథకం దేశానికి దిశానిర్దేశం చేస్తోంది: సీఎం
  • దళితబంధు పథకాన్ని సామాజిక ఉద్యమంగా అమలు చేస్తున్నాం: సీఎం
  • పథకం లబ్ధిదారుల భాగస్వామ్యంతో దళిత రక్షణ నిధి ఏర్పాటు: సీఎం
  • లబ్ధిదారులు ఆపదకు గురైతే ఆర్థికంగా నిలబెట్టేందుకు నిధి దోహదం: సీఎం

10:46 August 15

  • తెలంగాణ వృద్ధి రేటు దేశ వృద్ధిరేటు కంటే 27 శాతం అధికం: సీఎం
  • తలసరి ఆదాయం సగటు మనిషి ఆర్థిక ప్రగతికి గీటురాయి: సీఎం
  • 2013-14లో తలసరి ఆదాయం రూ.లక్షగా ఉండేది: సీఎం
  • 2021-22 నాటికి తలసరి ఆదాయం రూ.2.75 లక్షలకు పెరిగింది: సీఎం
  • ప్రస్తుతం జాతీయ తలసరి ఆదాయం రూ.1.5 లక్షలుగా ఉంది: సీఎం
  • రాష్ట్ర తలసరి ఆదాయం 84 శాతం అధికంగా ఉంది: సీఎం
  • ఏడేళ్లలో వ్యవసాయం పరిమాణం 2.5 రెట్లు పెరిగింది: సీఎం
  • పారిశ్రామిక రంగం రెండు రెట్లు, సేవా రంగం 2.2 రెట్లు పెరిగాయి: సీఎం

10:36 August 15

తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారింది: సీఎం

  • అహింసా మార్గంలో తెలంగాణ సాధించుకున్నాం: సీఎం
  • తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారింది: సీఎం
  • తెలంగాణ.. ప్రగతి పథంలో పయనిస్తోంది: సీఎం
  • తెలంగాణ.. అపూర్వ విజయాలను సొంతం చేసుకుంటోంది: సీఎం
  • బలీయమైన ఆర్థికశక్తిగా తెలంగాణ రూపొందింది: సీఎం
  • అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నాం: సీఎం
  • సాగులో 11.6 శాతం వృద్ధిరేటు సాధించాం: సీఎం
  • గొర్రెల పెంపకంలో దేశంలో నంబర్‌ వన్‌గా నిలిచాం: సీఎం
  • గ్రామీణ జీవన విధానంలో అగ్రస్థానంలో నిలిచాం: సీఎం
  • 11.1 శాతం వృద్ధిరేటుతో పారిశ్రామిక ప్రగతిలో అగ్రస్థానంలో ఉన్నాం: సీఎం
  • దేశ నిర్మాణంలో బలమైన భాగస్వామిగా తెలంగాణ నిలిచింది: సీఎం

10:25 August 15

ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగే సమయమిది: సీఎం

  • తెలంగాణ ప్రజలకు స్వాతంత్య్ర దిన శుభాకాంక్షలు: సీఎం
  • ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగే సమయమిది: సీఎం
  • చారిత్రక దినం సందర్భంగా ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలి: సీఎం
  • రాష్ట్రవ్యాప్తంగా 1.25 కోట్ల జెండాలను ప్రతి ఇంటికీ ఇచ్చాం: సీఎం
  • తెలంగాణ రాష్ట్రం త్రివర్ణ శోభితంగా విలసిల్లుతోంది: సీఎం
  • మహనీయుల త్యాగాల వల్లే స్వాతంత్య్ర ఫలాలు అనుభవిస్తున్నాం: సీఎం
  • మహనీయుల పోరాటాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయి: సీఎం

10:25 August 15

గోల్కొండ కోటలో జాతీయ పతాకం ఆవిష్కరించిన సీఎం

  • రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా స్వాతంత్య్ర దిన వేడుకలు
  • గోల్కొండ కోటలో జాతీయ పతాకం ఆవిష్కరించిన సీఎం
  • పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం కేసీఆర్‌

10:09 August 15

గోల్కొండ కోటకు చేరుకున్న సీఎం కేసీఆర్

  • గోల్కొండ కోట వేదికగా స్వాతంత్య్ర దిన వేడుకలు

  • గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించనున్న సీఎం
  • స్వతంత్ర భారత వజ్రోత్సవ సందేశం ఇవ్వనున్న సీఎం కేసీఆర్
  • గోల్కొండ కోటలో వెయ్యి మందికి పైగా కళాకారుల ప్రదర్శనలు

10:09 August 15

  • జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దిన వేడుకలు
  • జాతీయ పతాకం ఎగురవేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

10:09 August 15

  • హైదరాబాద్: బసవతారకం ఆస్పత్రిలో స్వాతంత్య్ర దిన వేడుకలు
  • జాతీయ పతాకం ఆవిష్కరించిన నందమూరి బాలకృష్ణ

10:09 August 15

  • జనగామ: దేవరుప్పలలో స్వాతంత్య్ర దిన వేడుకలు
  • ప్రశాంతి విద్యానికేతన్‌లో జాతీయజెండా ఆవిష్కరించిన బండి సంజయ్‌

10:09 August 15

  • సికింద్రాబాద్: అమర జవానుల స్మృతి చిహ్నం వద్ద సీఎం నివాళులు
  • అమరవీరుల త్యాగాలను స్మరించుకున్న సీఎం కేసీఆర్

09:49 August 15

  • హైదరాబాద్: చిరంజీవి రక్తనిధి కేంద్రంలో స్వాతంత్ర్య దిన వేడుకలు
  • జాతీయ జెండా ఆవిష్కరించిన చిరంజీవి మాతృమూర్తి అంజనాదేవి
  • వేడుకల్లో పాల్గొన్న అల్లు అరవింద్, రక్తనిధి కేంద్రం సిబ్బంది
  • వజ్రోత్సవ పండుగ జరుపుకోవడం మన అదృష్టం: చిరంజీవి
  • మహానీయుల త్యాగం వల్లే ఈ వజ్రోత్సవాలు: చిరంజీవి
  • స్వాతంత్ర్య సమరయోధులను కన్న తల్లులకు నివాళులు: చిరంజీవి

09:15 August 15

  • ప్రగతిభవన్​లో స్వాతంత్య్ర దినోత్సవాలు
  • జాతీయ జెండా ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్​
  • బీఆర్కే భవన్​లో జాతీయ జెండా ఎగురవేసిన సీఎస్​ సోమేశ్​కుమార్​

08:08 August 15

Independence Day Live Updates

  • రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్య్ర వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లు
  • ప్రభుత్వం ఆధ్వర్యంలో గోల్కొండ కోట వేదికగా స్వాతంత్య్ర వేడుకలు
  • గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేయనున్న సీఎం కేసీఆర్‌
  • పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్న సీఎం కేసీఆర్‌
  • పతాకావిష్కరణకు సీఎం వెళ్లేటపుడు జానపద కళాకారుల ఘన స్వాగతం
  • గోల్కొండ కోటలోని రాణీమహల్ లాన్స్‌లో సీఎం జాతీయ పతాకావిష్కరణ
  • అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న సీఎం కేసీఆర్‌
  • రాష్ట్రవ్యాప్తంగా వేడుకల్లో పాల్గొననున్న మంత్రులు, అధికారులు
  • స్వాతంత్ర్య వ‌జ్రోత్సవాల్లో భాగంగా పక్షం రోజుల పాటు కార్యక్రమాలు
  • సికింద్రాబాద్‌ సైనిక స్మారకం వద్ద అంజలి ఘటించనున్న కేసీఆర్‌

Last Updated : Aug 15, 2022, 12:35 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.