విశాఖ జిల్లా కేంద్ర కారాగారం నుంచి కొవిడ్-19 కారణంతో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం 74 మందిని మధ్యంతర బెయిల్పై అధికారులు విడుదల చేశారు. వీరిలో 53 మంది రిమాండ్ ముద్దాయిలు, 21 మంది శిక్ష కాలం ముద్దాయిలు ఉన్నారు. విడుదలైన వారిలో ఏడుగురు మహిళా ముద్దాయిలు ఉన్నట్టు అధికారులు తెలిపారు.
ఖైదీలందరికీ మాస్కులిచ్చామని జైలు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ తెలిపారు. బంధువులు వస్తే వారి స్వీయ పర్యవేక్షణలో పంపుతున్నారు. ఇళ్లకు వెళ్లినా అక్కడ స్వీయ నిర్బంధంలో ఉండేలా సూచనలు చేశారు. ముద్దాయిలు నెల రోజుల తరువాత తిరిగి జైల్ అధికారులకు రిపోర్ట్ చేయాలని సూపరింటెండెంట్ తెలిపారు.