అప్పటిదాకా రంగులు చల్లుకుంటూ...
హోలీ పండుగ చేసుకుంటూ గల్లీలోని చిన్నారులతో ఆడుకుంటుందనే నమ్మకంతో అమ్మ పనికెళ్లింది. వచ్చి చూస్తే ఎక్కడా కనిపించలేదు. తలోవైపు వెతికారు. అయినా లాభం లేకుండా పోయింది. భయంతో పోలీస్స్టేషన్లోఫిర్యాదు చేశారు. చిన్నారులంతా ఆడుకుంటుండగా.. తమ ఇంటికి దగ్గర్లో ఉండే బిహారీ యువకుల్లో ఒకరు వచ్చి తీసుకెళ్లాడంటూ చిన్నారి అన్న చెప్పగా.. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ముళ్లపొదల్లో రక్తపుముద్దగా...
అన్ని చోట్లా జల్లెడ పడితే... చివరికి రైల్వే ట్రాక్ పక్కన ముళ్లపొదల్లో విగతజీవిగా దొరికింది ఆ చిట్టితల్లి. రంగులు పూసుకుంటూ అప్పటిదాకా ఆడుకున్న తన పాప రక్తపు ముద్దగా కనిపించేసరికి శోకసంద్రంలో మునిగిపోయారు తల్లిదండ్రులు.
బిహారీ యువకులను విచారించగా...
హోలీ అడేందుకు అక్కడికి వచ్చిన వాళ్లందరినిపోలీసులువిచారించారు . అనుమానం ఉన్న బిహారీలను ప్రశ్నించారు. సాయంత్రం మూడు గంటల వరకు తమతోనే ఉండి.. ఆ తర్వాత కనిపించలేదనిస్నేహితుని గురించి చెప్పగా.. అతన్ని అదుపులోకి తీసుకుని తమ శైలిలో విచారిస్తే అసలు విషయం బయటపడింది.
మద్యం మత్తులో ఒళ్లు మరిచి...
పూటుగా మద్యం తాగిన బిహార్‌కి చెందిన రాజేష్... చిన్నారిని మచ్చిక చేసుకుని దుశ్చర్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అతికిరాతకంగా అత్యాచారానికి పాల్పడి... భరించలేక అరిచినందుకు ఇనుప తీగతో గొంతు కోసి చంపాడని వైద్యులు నిర్ధరించినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
బాధాతప్త హృదయాలతో ఆందోళన...
ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు, పలు పాఠశాల విద్యార్థులు,ఉపాధ్యాయులు బాధాతప్త హృదయాలతో ఆందోళన చేశారు. "కనీసం నిన్న పాఠశాల ఉన్నా నా కూతురు దక్కేది" అన్న తల్లి మాటలు కలచివేశాయంటూ ఉపాధ్యాయులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఉరే సరి...!
ఈ ఘటనపై పిల్లలను బయటకు పంపాలంటే భయపడే పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితున్ని ఉరి తీయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:12 గంటల్లోనే తుర్కపల్లి నిందితుడి పట్టివేత