ETV Bharat / state

కరోనాపై బుడతడి విజయం.. వైద్యులపై ప్రశంసల వర్షం - కరోనా నుంచి కోలుకున్న చిన్నారి

వెచ్చగా అమ్మ పొత్తిళ్లలో సేద తీరాల్సిన 25 రోజుల పసికందు 19 రోజుల క్రితం కరోనాతో గాంధీ ఆసుపత్రిలో చేరాడు. వైద్యుల తోడుగా వైరస్‌తో యుద్ధం చేశాడు. తన బిడ్డకు ఏమవుతుందోననే ఆందోళనలో ఉన్న ఆ తల్లి ఆశలు వమ్ముకాలేదు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా బుడతడు ఒడి చేరటంతో ఆ అమ్మ సంతోషానికి అవధులు లేవు. దేశంలో కరోనా సోకిన అత్యంత పిన్న వయసున్న బాబుకు సమర్థంగా చికిత్స అందించారంటూ గాంధీ ఆసుపత్రి వైద్యులను మంత్రి ఈటల రాజేందర్‌ అభినందించారు.

45 days child  recovered from corona in hyderabad
కరోనాపై పోరాటంలో గెలిచిన పసికందు
author img

By

Published : Apr 30, 2020, 7:15 AM IST

Updated : Apr 30, 2020, 8:02 AM IST

కరోనాను జయించాడు ఓ బుడతడు. 19 రోజులపాటు వైరస్​తో పోరాటం చేసి విజయం సాధించాడు. అత్యంత పిన్న వయసున్న బాబుకు సమర్థంగా చికిత్స అందించినందకు గాంధీ ఆసుపత్రి వైద్యులను మంత్రి ఈటల రాజేందర్‌ అభినందించారు.

జయించాడు

దిల్లీ నుంచి వచ్చిన మహబూబ్‌నగర్‌ వాసికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఏప్రిల్‌10న అతడి బిడ్డ నుంచి సైతం శాంపిళ్లు సేకరించారు.అప్పటికే ఆ పసికందు విరేచనాలు, జ్వరంతో బాధపడుతున్నాడు. చివరికి వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో 25 రోజుల బిడ్డను గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. చికిత్సకు ఎలా ముందుకెళ్లాలో చర్చించి వైౖద్యులంతా అప్రమత్తమయ్యారు. చిన్న పిల్లల డాక్టర్లు నిరంతరం పర్యవేక్షించారు. ఔషధాలు అందించారు. జ్వరం, విరేచనాలు తగ్గి క్రమంగా ఆరోగ్యం మెరుగుపడింది. ఏ దశలోనూ వెంటిలేటర్‌ అవసరం రాలేదని గాంధీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు. ఇటీవల 75, 78 ఏళ్ల వయసున్న ఇద్దరు వృద్ధులు కూడా గాంధీ ఆసుపత్రిలో కోలుకున్న సంగతి తెలిసిందే.

మరో 12 మంది చిన్నారులు సైతం

గాంధీ ఆసుపత్రి నుంచి బుధవారం మరో 12 మంది పిల్లలు కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. వీరిలో హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాలకు చెందినవారున్నారు. ఇంకా వివిధ వయసుల్లో ఉన్న 75 మంది పిల్లలు ప్రస్తుతం గాంధీలో చికిత్స పొందుతున్నారు. వారందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరికీ వెంటిలేటర్‌ సాయం అవసరం లేదని సూపరింటెండెంట్‌ తెలిపారు.

కరోనాపై బుడతడి విజయం.. వైద్యులపై ప్రశంసల వర్షం

ఇవీ చూడండి: నయా మోసం.. లింక్​ యాక్సెప్ట్ చేస్తే మొబైల్ రీఛార్జ్

Last Updated : Apr 30, 2020, 8:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.