లాక్డౌన్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. గూగుల్ పే కస్టమర్ కేర్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఓ వ్యక్తి గూగుల్ పే ద్వారా తన ఫోన్‌కి రీఛార్జ్ చేశాడు. రీఛార్జ్ కాకపోవడం వల్ల కస్టమర్ కేర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేశాడు. కస్టమర్ కేర్ నంబర్‌కి కాల్ చేసి తన సమస్య చెప్పాడు. అంతే.. అదే అదునుగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు... తక్షణం ఫోన్ రీఛార్జ్ కావాలంటే తాము పంపించిన లింక్‌ను యాక్సెప్ట్ చేయాలని కేటుగాళ్లు సూచించారు. బాధితుడు లింక్ యాక్సెప్ట్ చేయగానే.. యూపీఐ నంబర్ ద్వారా రూ. 64,000ను సైబర్ నేరగాళ్లు కాజేశారు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: తెలంగాణలో మరో ఆరుగురికి కరోనా.. 1009కి చేరిన కేసులు