ETV Bharat / state

దశాబ్దాలుగా 1998 డీఎస్సీ అభ్యర్థుల పోరాటం - ఉద్యోగం కోసం 1998 డీఎస్సీ అభ్యర్థుల పోరాటం

ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు మారిపోతున్నారు. అయినా రెండు దశాబ్దాలకుపైగా ఆ వివాదానికి మాత్రం తెరపడటం లేదు. ఓ వైపు ట్రైబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం.. మరోవైపు పంచాయతీ నుంచి పార్లమెంటు వరకూ వేడుకోలు.. ఇదీ 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల పరిస్థితి. ఉద్యోగం రాకుండానే ఉద్యోగ విరమణ వయసుకు చేరారు కొందరు.. పోరాడి పోరాడి తనువు చాలించారు మరికొందరు. అయినప్పటికీ.. ఏదో ఒక రోజు ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందన్న ఆశతో ఎదురు చూస్తున్నారు.

దశాబ్దాలుగా 1998 డీఎస్సీ అభ్యర్థుల పోరాటం

author img

By

Published : Aug 21, 2020, 7:21 PM IST

ఒకరోజో.. రెండు రోజులో కాదు.. ఏడాది, రెండేళ్లూ కాదు.. రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. ఓ వైపు పోరాడుతున్నారు.. మరోవైపు వేడుకుంటున్నారు. ఆగ్రహం.. ఆవేదన.. ఆందోళన.. అన్నీ ప్రదర్శిస్తున్నారు. ఇరవై రెండేళ్లుగా ఉద్యోగం దక్కుతుందున్న విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు... 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు. సుదీర్ఘకాలంగా ఉద్యోగం కోసం పోరాడుతున్న వందలాది అభ్యర్థులు ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ తమపై కరుణ చూపిస్తారని ఆశతో ఎదురుచూస్తున్నారు. న్యాయస్థానాలన్నీ తమకు అనుకూలంగా తీర్పులు చెప్పినందున... ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకంతో నిరీక్షిస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో 1998లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం మెగా నోటిఫికేషన్ విడుదలైంది. అప్పటికే బీఈడీ చదివిన యువతీ యువకులు ఉపాధ్యాయ వృత్తిలో చేరాలన్న ఆశయంతో కష్టపడి చదివి డీఎస్సీ రాశారు. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 5వేల మంది 1998 డీఎస్సీలో అర్హత సాధించారు. అయితే నియామకాలకు సంబంధించి రెండు జీవోలు జారీ చేయడం వల్ల వివాదానికి తెరలేచింది. మొదట బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీలకు కటాఫ్ ఖరారు చేస్తూ జీవో 221జారీ అయింది. అయితే కొన్ని జిల్లాల్లో కొన్ని కేటగిరీల్లో... కటాఫ్ మార్కులు తగ్గిస్తూ జీవో 618 విడుదల చేసింది. నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో... అక్కడే మొదలైంది.. వివాదం.

ఆ సమయంలో ఉపఎన్నికలు రావడం వల్ల కొన్ని జిల్లాల్లో నియామక ప్రక్రియ వాయిదా వేసి.. తర్వాత మళ్లీ చేపట్టారు. అధికారులు రెండు జీవోలను ఒకేసారి అమలు చేయడం వల్ల రెండో జీవో ప్రకారం.. తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు వచ్చాయనేది వివాదం. మరోవైపు ఈ జీవోల గందరగోళాన్ని, ఇంటర్వ్యూ ప్రక్రియను అవకాశంగా మలుచుకొని.. భారీగా అవినీతి, అవకతవకలకు తెరలేపి.. అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

అలా 1998లో మొదలైన వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కటాఫ్ మార్కులను తగ్గించడాన్ని కొందరు అభ్యర్థులు ఏపీ పరిపాలన ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. నియామక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కటాఫ్ మార్కులు తగ్గించడాన్ని తప్పుబడుతూ ట్రైబ్యునల్ 2009లో తీర్పు వెల్లడించింది. దాన్ని హైకోర్టు కూడా 2011లో సమర్థించింది. అలా ట్రైబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టులో దశాబ్దాలుగా వివిధ అభ్యర్థనలతో వేర్వేరు కేసులు నడుస్తూనే ఉన్నాయి. నల్గొండ, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో సుమారు 400 మంది అభ్యర్థులను ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని గతేడాది సెప్టెంబరులో హైకోర్టు స్పష్టం చేసింది. సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించైనా ఇవ్వాలని చెప్పింది. ఆదేశాలు అమలు కానందుకు నాలుగు జిల్లాల డీఈఓలపై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం కూడా నమోదైంది.

ఓ వైపు న్యాయపోరాటం చేస్తూనే రాజకీయంగా ఒత్తిడి తెచ్చేందుకు 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు 22 ఏళ్లుగా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పంచాయతీ నుంచి పార్లమెంటు ప్రతినిధుల వరకూ తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రతీ ఎన్నికల సందర్భంలోనూ నేతలు 1998 డీఎస్సీ అభ్యర్థులకు హామీలు ఇస్తూనే ఉన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వీరికి ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రికి లేఖలు రాశారు. ఉపాధ్యాయ, ప్రజా సంఘాలు కూడా మద్దతుగా నిలిచాయి. అయినప్పటికీ న్యాయం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఇరవై రెండేళ్లలో సుమారు 50 మందికి పైగా ఉద్యోగం పొందకుండానే మరణించారు. మరికొందరు ఉద్యోగ విరమణ వయసును దాటేశారు. కొందరు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తుండగా.. మరికొందరు కూలీలుగా కూడా మారిపోయి.. అప్పుల ఊబిలో చిక్కుకొన్నారు. తమకు ఎప్పటికైనా ఉపాధ్యాయ ఉద్యోగం వస్తుందనీ.. తమ కష్టాలకు తెరపడుతుందన్న ఆశతో ఉన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు కచ్చితంగా న్యాయం చేస్తారని కొండంత ఆశతో 1998 డీఎస్సీ అభ్యర్థులు ఆశతో ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ జన్మదినం, పెళ్లి రోజు ఇలా ఏ సందర్భం వచ్చినా.. శుభాకాంక్షలు చెబుతూ.. దానితో పాటు తమ అభ్యర్థనను గుర్తు చేస్తున్నారు. సీఎం కంటి ఆపరేషన్ కోసం వెళితే.. ఆలయాల్లో పూజలు చేశారు. విజయం సాధిస్తే.. పాలాభిషేకాలు చేశారు. ఇలా చేస్తేనయినా సీఎం కరుణించి.. ఉద్యోగాలు ఇస్తారని 1998 డీఎస్సీ అభ్యర్థుల ఆశ.

ఓ వైపు కోర్టు తీర్పులు.. మరోవైపు గతంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ.. తాజాగా పోస్టు కార్డుల ఉద్యమం ప్రారంభించారు. నాలుగు జిల్లాలకు చెందిన సుమారు 500 మందికి ఉపాధ్యాయ ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ సీఎంకు లేఖలు రాస్తున్నారు.

ఇదీ చూడండి: 'దట్టమైన పొగల వల్లే లోనికి వెళ్లడం కష్టమవుతోంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.