15వ ఆర్థిక సంఘం తెలంగాణలో పర్యటించనుంది. గత ఆర్థిక సంవత్సరంలో అన్యాయం జరిగిందన్న ప్రభుత్వం... ఈసారి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబెట్టేందుకు కసరత్తు చేస్తోంది. మొదటగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఉన్నతాధికారులు కమిషన్‌తో సమావేశమై రాష్ట్ర ప్రతిపాదనలు వారి ముందు ఉంచనున్నారు. రెండు రోజులు హైదరాబాద్‌లోని జూబ్లీహాల్లో ఆర్థిక సంఘం సమావేశాలు జరగనున్నాయి. మూడో రోజు క్షేత్రస్థాయిలో పర్యటించి కాళేశ్వరం, మిషన్ భగీరథ పనులను పరిశీలిస్తారు.
ఈనెల 18నుంచి మూడ్రోజులు పాటు ఎన్కేసింగ్ బృందం రాష్ట్రంలో పర్యటించి ప్రతిపాదనలు స్వీకరించనుంది. భవిష్యతు అవసరాలు దృష్టిలో ఉంచుకొని 15వ ఆర్థిక సంఘానికి నివేదికను సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఇప్పటికే ఆదేశించారు. గతంలో కేంద్ర ఆర్థిక సంఘంలో పనిచేసిన రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక రంగ సలహాదారు జీఆర్ రెడ్డి ఈ విషయమై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు.
రాష్ట్రాల పనితీరు, పురోగతి ఆధారంగా కేంద్ర ఆర్థిక సంఘం ప్రోత్సాహక నిధులు ఇవ్వడానికి కొన్ని అంశాలను ప్రాతిపదికగా తీసుకోనుంది. అలాగే జనాభా నియంత్రణ, డిజిటల్ లావాదేవీలు, హరితహారం, జలవనరుల సంరక్షణ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంపై దృష్టి వంటి అంశాల్లో రాష్ట్రం పురోగతిలో ఉందని... వాటి ఆధారంగా ప్రోత్సాహక నిధులు పొందాలని ప్రభుత్వ ఆలోచన.
రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం - G.R. reddy
ఎన్కే సింగ్ నేతృత్వంలోని 15 ఆర్థిక సంఘం రాష్ట్రంలో పర్యటించనుంది. తెలంగాణకు రావాల్సిన నిధులపై ముఖ్యమంత్రితో సహా పలు అధికారులతో సమావేశం కానుంది.