ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా లాక్‌డౌన్‌... వివిధ చోట్ల చెక్‌పోస్టులు - తెలంగాణలో లాక్​డౌన్

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పదమూడో రోజు కఠినంగా అమలు చేస్తున్నారు. మొదట్లో చూసీచూడనట్లు ఉండగా.. జనాలు ఎక్కువగా రోడ్లపైకి వచ్చారు. మళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం రాకుండా ప్రస్తుత లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల తర్వాత... పోలీసులు ఆంక్షలు పక్కాగా అమలయ్యేలా చూస్తున్నారు.

13th-day-of-lockdown-in-telangana-due-to-covid-pandemic
ఉదయం నుంచి దుకాణాల వద్ద కిటకిట.. 10 తర్వాత స్తబ్ధత
author img

By

Published : May 24, 2021, 10:49 AM IST

Updated : May 24, 2021, 1:51 PM IST

రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఉదయం 10 గంటల తర్వాత ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. నగరాలు, పట్టణాల్లోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి రోడ్లపై తిరిగేవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత దాదాపు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.

కఠినంగా అమలు

కరోనా కట్టడికి అమలు చేసిన లాక్‌డౌన్‌ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. అధికశాతం ప్రజలు ఉదయం 10 గంటల తర్వాత ఇళ్లకే పరిమితంకాగా... నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చేవారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌ ఏంజె మార్కెట్‌లో 10 తర్వాత జనాలు ఎక్కువగా ఉండడంతో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. కేసులు నమోదు చేయడంతోపాటు నిబంధనలు అతిక్రమించినందుకు వాహనాలు జప్తు చేశారు. కొంతమంది పోలీసులతో వాగ్వావాదానికి దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కొంపల్లిలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు మేడ్చల్‌ జాతీయ రహదారిపై రద్దీ ఏర్పడింది. అంబులెన్సులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక దారి ఏర్పాటు చేసి సాధారణ వాహనాలన్నీ ఒకే వరసలో వచ్చేలా చర్యలు తీసుకున్నారు. మీర్‌పేట్‌, బాలాపూర్‌ పరిధిలోని చెక్‌పోస్టులను రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ పరిశీలించారు. కరోనా కట్టడికి కృషి చేస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.

ఎక్కడికక్కడ తనిఖీలు

వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండలో పోలీసులు లాక్‌డౌన్‌ను మరింత కఠినం చేశారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనదారులను కట్టడి చేస్తున్నారు. ఉదయం 10 తర్వాత అనవసరంగా బయటకు వస్తే ఊరుకునేది లేదని పోలీసులు హెచ్చరించారు. ఇప్పటికే కొన్ని వాహనాలను సీజ్ చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని, కమాన్‌పూర్‌, రామగిరిలో లాక్‌డౌన్‌ను సీఐ సతీష్‌ పర్యవేక్షించారు. ఉదయం 10 తర్వాత ఎవరూ వ్యాపార, వాణిజ్య సముదాయాలు తీసి ఉంచవద్దని సామాజిక మాధ్యమాలు, మైకుల ద్వారా ప్రచారం చేశారు. నిజామాబాద్ జిల్లాలోనూ ఉదయం పది తర్వాత ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరంలోని కంఠేశ్వర్ బైపాస్, పోలీస్ కమిషనరేట్, పులాంగ్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో ఉన్నతాధికారులు తనిఖీలు చేశారు. సంగారెడ్డిలో ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు.

ఇదీ చూడండి: రెండు రోజులుగా కఠినంగా లాక్​డౌన్​ అమలు

Last Updated : May 24, 2021, 1:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.