ETV Bharat / state

మూగజీవాల సంరక్షణ కోసం.. చిన్నారి అక్షర యజ్ఞం

ఆ చిన్నారి వయస్సు 11 ఏళ్లు. ఎనిమిదేళ్లప్పుడు అమ్మానాన్నలు బహుమతిగా ఇచ్చిన కుక్కపిల్ల ఇప్పుడు ఆ చిన్నారిని పెద్ద రచయితను చేసింది. ఆ కుక్కపిల్ల చేసే అల్లరి, సాహసాలను అక్షరాలుగా మార్చి మూగజీవాలపై తనదైన శైలిలో పుస్తకాలు రచిస్తోంది. ఆమే హైదరాబాద్​కు చెందిన క్రితి మునగాల. ప్రపంచంలో ఏ మూగజీవికి ఆపదొచ్చినా... నేనున్నానంటూ నిధులు సేకరించి అండగానిలుస్తోంది క్రితి. తన పుస్తకాల విక్రయం ద్వారా వచ్చే డబ్బును మూగజీవాల సంరక్షణ కోసం వెచ్చిస్తోంది.

11 years girl is writing books on animal and their rights in hyderabad
మూగజీవాల సంరక్షణ కోసం.. చిన్నారి అక్షర యజ్ఞం
author img

By

Published : Feb 19, 2020, 8:07 AM IST

మూగజీవాల సంరక్షణ కోసం.. చిన్నారి అక్షర యజ్ఞం

ఈ చిన్నారి పేరు క్రితి మునగాల. నగరంలోని ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌లో ఆరో తరగతి చదువుతోంది. ఓ రోజు తన అమ్మానాన్నలు ఓ బుజ్జి కుక్కపిల్లను బహుమతిగా ఇచ్చారు. దానికి సుషి అనే పేరు పెట్టుకుని తమ్ముడిలా భావిస్తూ దాంతో ఆడుకుంటోంది. సుషి చేసే అల్లరి చూస్తూ చిన్నచిన్న బొమ్మలు వేయడం, దాని పేరుతో జంతువుల పాత్రలతో ఆసక్తికరమైన కథలు రాయడం చేసేది. ఆ కథలను చదివిన తల్లిదండ్రులు క్రితిని పుస్తక రచనవైపు ప్రోత్సహించారు.

అమెజాన్​లో క్రితి రచనలు

2018లో ‘సూపర్‌ సుషి అడ్వెంచర్స్‌ - ది ఫన్‌ బిగిన్స్ , 2019లో ‘సూపర్‌ సుషి అడ్వెంచర్స్‌ - ది మంకీ ఐడల్‌ రెస్క్యూ’ పేరుతో పుస్తకాలను రాసి ఆన్​లైన్​లో అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడో పుస్తకం.. "‘ది జురాసిక్‌ జీయోపార్డీ"’ పేరిట రాసిన పుస్తకం ప్రచురణకు సిద్ధమైంది. నాలుగో పుస్తక రచన పూర్తైంది. వాటిలో పూర్తిగా పిల్లల్ని ఆకట్టుకునే సాహస కథలను సిరీస్​గా రాస్తోంది క్రితి. అమెజాన్ ప్లాట్ ఫాం క్రియేటివ్ వర్క్ లేబుల్​లో క్రితి రాసిన పుస్తకాలకు డిమాండ్ పెరుగుతోంది.

యానిమల్​ ఫరెవర్ క్లబ్

సుషి స్ఫూర్తితో పుస్తకాలు రాయడమే కాదు... తాను చదివే పాఠశాలలో ప్రిన్సిపల్‌, స్నేహితుల సాయంతో ‘యానిమల్‌ ఫరెవర్‌’ పేరిట క్లబ్‌ ఏర్పాటు చేసింది క్రితి. ఈ క్లబ్‌ ద్వారా నెలలో రెండు వారాలు వివిధ రకాల సామాజిక కార్యక్రమాలు చేపడుతుంటారు. దాని ద్వారా వచ్చే డబ్బును పూర్తిగా జంతు సంరక్షణ, స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందిస్తున్నారు.

అతి చిన్న కార్యకర్త

మొదటి పుస్తకం ద్వారా వసూలైన 65 వేల రూపాయలను నగరంలోని బ్లూక్రాస్, పీపుల్‌ ఫర్‌ ఆనిమల్, అమెరికాలోని రెడ్‌రోవర్‌ స్వచ్ఛంద సంస్థలకు అందజేసి మూగజీవాల పట్ల మమకారాన్ని చాటుకుంది. ఏనిమిదేళ్ల వయస్సులోనే బ్లూక్రాస్‌ స్వచ్ఛంద చేరి అతి చిన్న కార్యకర్తగా గుర్తింపు పొందింది. యూఎస్‌లోని రెడ్‌రోవర్‌ జంతు సంరక్షణ సంస్థలో యానిమల్‌ అడ్వకేట్‌గా పనిచేస్తోంది. ఆ సంస్థకు ఇక్కడి నుంచే కథనాలు రాయడం, జంతువులపై వీడియోలు చేయడం ద్వారా సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతోంది.

ఆస్ట్రేలియా ఆవేదన

ఇటీవల ఆస్ట్రేలియా కార్చిచ్చులో దహనమైన మూగజీవాలు తనని తీవ్రంగా కలచి వేశాయని కృతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. అక్కడి జంతువులను సంరక్షణకు తనవంతు సాయం చేసేందుకు అక్షర యజ్ఞం చేస్తోంది. ఇకపై తన పుస్తకాలు, ఇతర కార్యక్రమాల ద్వారా వచ్చే సొమ్మును ఆస్ట్రేలియన్‌ వైల్డ్‌లైఫ్‌ రికవరీకి అందిస్తానని చెబుతోంది.

  • భవిష్యత్​లో మూగజీవాలపై మరిన్ని పుస్తకాలు తీసుకొచ్చేందుకు తన రచనకు మెరుగులు దిద్దుకుంటోన్న క్రితి... మూగజీవాల హక్కుల కోసం న్యాయవాది కావాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రజలు జంతువులపై చూపించే ప్రేమలో మరింత మార్పు రావాలని ఆకాంక్షిస్తోంది. ప్రతి పాఠశాలలోనూ యానిమల్ క్లబ్​లు ఏర్పాటు చేయాలని కోరుతోంది. అలాగే ఓ జంతు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తోంది. క్రితి రచనా శైలి, మూగజీవాల పట్ల తనకున్న ప్రేమను చూసి చాలా మంది జంతు ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు ప్రశంసిస్తున్నాయి.
  • ఇదీ చూడండి : జాతి వైరం మరిచే... స్నేహానికి నిదర్శనంగా నిలిచే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.