హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఛాతీ వైద్యశాలలో చికిత్స పొంతున్న కరోనా బాధితుల్లో 11 మందిని ఇవాళ డిశ్చార్జ్ చేయనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ మహబూబ్ ఖాన్ తెలిపారు. వీరిలో 9 మంది ఇండోనేషియన్లు కాగా మరో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
వీరేకాక మరో ఆరుగురికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మరో ఏడుగురు కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఇండోనేషియాకి చెందిన వారిని ఎంబసీ డాక్టర్లకు అప్పగించనున్నట్లు వివరించారు. వారు మరో 14 రోజుల పాటు క్వరంటైన్లోనే ఉండాల్సి వస్తుందని వెల్లడించారు.
ఇవీచూడండి: తెలంగాణలో ఆరుకు చేరిన కరోనా మృతుల సంఖ్య