ETV Bharat / state

10న తొలి జాబితా!

author img

By

Published : Mar 8, 2019, 8:01 AM IST

Updated : Mar 8, 2019, 12:01 PM IST

రాష్ట్రంలో లోక్​సభ బరిలో నిలిపే అభ్యర్థులను సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని కాంగ్రెస్​ పార్టీ నిర్ణయించింది. తొలి జాబితాను ఈ నెల 10న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఆదివారం జరిగే ఏఐసీసీ ఎన్నికల కమిటీ సమావేశం మొదటి జాబితాకు ఆమోద ముద్ర వేయనుంది.

కాంగ్రెస్​ జాతీయాధ్యక్షుడు రాహుల్​ గాంధీ
10న కాంగ్రెస్ తొలి జాబితా
రాష్ట్రంలోని 17 లోక్​సభ స్థానాలకు గాను ఇప్పటికే అభ్యర్థుల వడపోత ప్రక్రియను కాంగ్రెస్ కొనసాగిస్తోంది. పూర్తి స్పష్టత ఉన్న స్థానాల్లో అభ్యర్థులను మొదటగా ప్రకటించనున్నారు. జిల్లా కమిటీల నుంచి వచ్చిన పేర్లపై కసరత్తు చేసిన పీసీసీ ఎన్నికల కమిటీ ఐదు పేర్లతో కూడిన జాబితాను ఏఐసీసీ ఎన్నికల కమిటీకి అందజేసింది. ఈ నేపథ్యంలో చేవెళ్ల, కరీంనగర్​, సికింద్రాబాద్​, జహీరాబాద్​, మహబూబాబాద్​, ఆదిలాబాద్​ స్థానాలకు తొలి జాబితాలో పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.

మొదటి జాబితాలో...

చేవెళ్ల నుంచి ప్రస్తుతం ఎంపీగా ఉన్న కొండ విశ్వేశ్వరరెడ్డి, కరీంనగర్​ నుంచి పొన్నం ప్రభాకర్​, సికింద్రబాద్​ నుంచి అంజన్​ కుమార్​ యాదవ్​, జహీరాబాద్​ నుంచి మదన్​ మోహన్​ పేర్లు ఖరారైనట్లు తెలిస్తోంది. హైదరాబాద్​,మహబూబాబాద్​, ఆదిలాబాద్​ నుంచి అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారైనా ఇతర ఆశావహులతోచర్చించి ఒకటి రెండు రోజుల్లో ఈ మూడు స్థానాల అభ్యర్థులపై ఏకాభిప్రాయానికి రావచ్చని సమాచారం. మొదటి జాబితాలో ఐదు లేదా ఏడుగురు పేర్లను ప్రకటించడానికి కాంగ్రెస్​ పార్టీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

ఇవీ చూడండి:బీసీలకు ఒక్కస్థానం దక్కలేదు

Intro:

Body:kdl

Conclusion:కొడంగల్ లో అన్ని విధాల అభివృద్ధి పనులు చేసి ఇ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకు వస్తారని ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి తెలిపారు వరంగల్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో 30 లక్షల నిధులతో మంజూరైన ఐసిడిఎస్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి ఇ శంకుస్థాపన చేశారు అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ తూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తుందని తెలిపారు చిన్నారులు తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం పాఠశాలలోని గడుపుతారు కాబట్టి ఉపాధ్యాయులు విద్యార్థులతో ప్రేమగా మెలిగి వారికి పాఠాలు బోధించాలని తెలిపారు అనంతరం కస్తూర్బా పాఠశాలలో ఇంటర్మీడియట్ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు ఆడపిల్లలు లు ఉన్నత చదువులకు దూరమై మధ్యలోనే చదువు ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ కస్తూర్బా పాఠశాలలో ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభించిందని తెలిపారు
Last Updated : Mar 8, 2019, 12:01 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.