రథసప్తమి సందర్భంగా కంటోన్మెంట్ బొల్లారం పార్కులో నిర్మల యోగా సెంటర్ ఆధ్వర్యంలో 108 సూర్య నమస్కారాలు చేపట్టారు. రథ సప్తమిని పురస్కరించుకుని ఈ యోగాసనాలు చేపట్టినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ప్రతి సంవత్సరం రథసప్తమి రోజున సూర్యభగవానుడిని ఆరాధించేందుకు 108 సార్లు సూర్య నమస్కారాలు చేస్తామని అన్నారు. యోగా సాధకులందరు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రతిరోజు సూర్యనమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యం ఎంతగానో మెరుగవుతుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండిః మందేశాడు... తర్వాత విద్యుత్ స్తంభంపై చిందేశాడు..!