ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం కొలువుండటం సికింద్రాబాద్ వాసులు చేసుకున్న అదృష్టమని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న బోనాలు.. ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్తో కలిసి సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈసారి బోనాల ఉత్సవాలకు ప్రత్యేకంగా శ్రీ చక్రాన్ని తయారు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బోనాల ఉత్సవాలు విశ్వవ్యాప్తం చేసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.
ఇదీ చూడండి: ఎర్ర చీమల గుడ్ల పచ్చడి...మీకు..తెలుసా...!