ప్రజాస్వామ్యం ఇవాళ నడి బజార్లో హత్య చేయబడిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని గతంలోనే సభాపతిని కోరినట్లు తెలిపారు. అనర్హత పిటిషన్లు హైకోర్టులో, సభాపతి వద్ద పెండింగ్లో ఉండగా ఇప్పుడు విలీన నిర్ణయం తీసుకోవడం చట్టవిరుద్ధమన్నారు. అభద్రతాభావంతోనే కేసీఆర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ఇవీ చూడండి: అసెంబ్లీ ముందు పొన్నాల ధర్నా, అరెస్టు