శంషాబాద్ శాతంరాయి గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎయిర్‌కూలర్లు తయారయ్యే కంపెనీలో విద్యుదాఘాతం సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లోపల పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక శాఖాధికారులు నాలుగు శకటాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
