ఇవీ చూడండి:శివరాత్రి ఎందుకు జరుపుకుంటాం!
ఉపవాసంతో ఆత్మ శుద్ధి - CELEBRATIONS
ప్రకృతి వైద్యం ప్రకారం వారంలో ఓ రోజు ఉపవాసం అనేది ఆరోగ్యానికి మంచిదే... అదే విధంగా శివరాత్రి రోజున వికారాల ఉపవాసంతో ఆత్మశుద్ధి చేసుకోవాలంటున్నారు బ్రహ్మకుమారీలు.
శివుని సేవలో..
హైదరాబాద్ దోమలగూడలోని ఓ కళాశాలలో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ మహశివరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకలను స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. భారీ శివలింగం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. పండగ ప్రాశస్త్యాన్ని ప్రజలకు చెప్పేందుకే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు బ్రహ్మకుమారీలు తెలిపారు. మూడు రోజుల పాటు ఉచిత ధ్యాన తరగతులు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి.
ఇవీ చూడండి:శివరాత్రి ఎందుకు జరుపుకుంటాం!
sample description