అందరిని మాటల చతురతతో నవ్వుల్లో ముంచెత్తి హాస్యబ్రహ్మ శంకర్ నారాయణ అని... రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణా చారి అన్నారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో డాక్టర్ శంకర్ నారాయణ రచించిన సోదర సోదరీమణులారా పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి పుస్తకాన్ని ఆవిష్కరించారు. డాక్టర్ కె.వి.రమణా చారికి పుస్తకాన్ని శంకర్ నారాయణ అంకితం చేశారు. మన భాష, సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడం, హాస్యంలో తనదైన శైలిని పెంపొందించుకొని హాస్యబ్రహ్మగా ప్రజల హృదయాల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్నారని ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి అన్నారు. ఈ కార్యక్రమంలో సుద్దాల అశోక్ తేజ, గోరేటి పార్వతీశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరి అందరిని ఆకట్టుకుంది.
'సోదర సోదరీమణులారా' పుస్తకావిష్కరణ - sankar narayana
డాక్టర్ శంకర్ నారాయణ రచించిన సోదర సోదరీమణులారా పుస్తకం ఆవిష్కరణ హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.