ఇంటర్ ఫలితాల వ్యవహారంలో అక్రమాలకు నిరసనగా... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నారు. నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ దీక్ష ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ప్రభుత్వం స్పందించే వరకూ కొనసాగుతుందని తెలిపారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇంటర్ ఫలితాల వివాదంపై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు మరోసారి విచారణ జరపనుంది. జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని... ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కోరుతూ బాలల హక్కుల సంఘం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. అనుత్తీర్ణలైన విద్యార్థుల సమాధాన పత్రాలు పునఃమూల్యాంకనం చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, సమస్య పరిష్కారానికి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని హైకోర్టు గతంలో ఇంటర్ బోర్డును ఆదేశించింది. బదులుగా ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా పునఃపరిశీలన ప్రక్రియ చేపట్టామని, తప్పుడు మూల్యాంకనం చేసిన ఇద్దరిపై చర్యలు తీసుకున్నామని వివరించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది.
ఇవీ చూడండి: ముగిసిన రెండో విడత నామినేషన్ల స్వీకరణ