భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ సమావేశంలో జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య అటవీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా గిరిజనులను ఇబ్బంది పెట్టే చర్యలు మానుకోవాలని కోరారు. 2005 సంవత్సరం కంటే ముందుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతుల జోలికి వెళ్లొద్దంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
కూనవరం మండలంలోని ఆదివాసీలకు పాసుపుస్తకాలు ఉన్నా.. సాగు చేయవద్దంటూ రైతులను అధికారులు ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. లక్ష్మీదేవి పల్లి మండలంలో 1950 నాటి నుంచి ఉన్న ఆదివాసీల గుడిసెలను తొలగించే ప్రయత్నాలు చేస్తున్న అటవీశాఖ అధికారులను ఐటీడీఏ పీవో గౌతమ్ సమక్షంలో నిలదీశారు.
ఇదీ చదవండి: థియేటర్లలోకి 100 శాతం ప్రేక్షకులు.. జూ.డాక్టర్ ఆవేదన