భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం లచ్చగూడెంలో దారుణం చోటుచేసుకుంది. కారం చిన్న రామకృష్ణ అనే తాత్కాలిక ఉద్యోగిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అర్ధరాత్రి రామకృష్ణ ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న అతనిపై ముగ్గురు దాడి చేశారు. కత్తితో గొంతు కోసి హత మార్చారు. అడ్డొచ్చిన భార్యను దారుణంగా కొట్టడం వల్ల ఆమెకూ గాయాలయ్యాయి.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయాలైన రామకృష్ణ భార్యను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు రామకృష్ణ రామచంద్రునిపేట పాఠశాలలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్నారు.
ఇదీ చదవండి: హాంకాంగ్ నౌకలోని ప్రయాణికులకు విముక్తి