కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో హాంకాంగ్‌లో ఐదు రోజులుగా పర్యటక నౌకలోనే ఉంచిన వేలాది మంది ప్రయాణికులకు విముక్తి లభించింది. వారికి నిర్వహించిన పరీక్షలో కరోనా లక్షణాలు లేవని తేలినందున వారు బయటకు వచ్చేందుకు అనుమతిచ్చారు. నౌకలో వియత్నాంకు వెళ్లేందుకు వచ్చిన ముగ్గురు చైనా ప్రయాణికులకు కరోనా లక్షణాలు బయటపడటం వల్ల మిగతా వారికి కూడా వైరస్ సోకి ఉంటుందని అధికారులు అనుమానించారు.
ఈ నేపథ్యంలో నౌకలోని 18వందల మంది ప్రయాణికులను అందులోనే ఉంచి పరీక్షలు నిర్వహించారు. వారిలో వ్యాధి లక్షణాలు లేవని పరీక్షల్లో తేలడం వల్ల వారిని బయటకు వెళ్లేందుకు అనుమతిచ్చారు.
ఇదీ చూడండి: పిల్లలకు నిద్ర తక్కువైతే ఎన్నో సమస్యలు..!