లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారి రెండు కార్లు, పలు బైకులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పోలీసులు సీజ్ చేశారు. డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఐ రమేష్ పర్యవేక్షణలో లాక్డౌన్ మరింత పటిష్ఠంగా అమలు చేస్తున్నారు.
పలు సెంటర్లలో పోలీసుల తనిఖీల నేపథ్యంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. అనుమతి లేని వాహనాలను పట్టణంలోనికి అనుమతించడం లేదు. ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాల్సిందేనని డీఎస్పీ రవీందర్రెడ్డి అన్నారు.
ఇదీ చదవండి: రహదారులపైకి వాహనదారులు.. సీజ్ చేస్తున్న పోలీసులు