ETV Bharat / state

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం - two men died

బతుకుదెరువు కోసం రాష్ట్రం కాని రాష్ట్రానికి వచ్చారు. కష్టపడి ఉన్నంతలో సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. కానీ ఇంతలోనే... జరగరాని ఘోరం జరిగింది. మద్యం మత్తులో చెట్టును ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
author img

By

Published : Jan 5, 2020, 11:38 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఓట్లపల్లి సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో మూల మలుపు వద్ద చెట్టు ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా... ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ వార్త విన్న కుటుంబసభ్యులు గుండె బద్దలయ్యేలా రోదిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం, క్షతగాత్రుడిని చికిత్స కోసం అశ్వారావు పేట ఆసుపత్రికి తరలించారు.

బిహార్​కు చెందిన అనిల్ కుమార్ యాదవ్ కుటుంబసభ్యులతో కలిసి పదేళ్ల క్రితం అశ్వారావుపేటకు వలస వచ్చాడు. ఓ వస్త్ర దుకాణం నడుపుతూ... జీవనం సాగిస్తున్నాడు. చందన్​ యాదవ్​ దుకాణంలో గుస్తాగా పనిచేస్తున్నాడు. ఆదివారం సెలవు కావటం వల్ల... రోహిత్ యాదవ్​తో వినాయకపురం చిలకల గండి ముత్యాలమ్మ దర్శనం కోసం వెళ్లారు. అనంతరం స్నేహితుడు ఇచ్చిన విందులో మద్యం తాగారు. ఇంటికి తిరిగి వస్తుండగా... ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో అనిల్​యాదవ్​, చందన్​ యాదవ్ అక్కడికక్కడే మృతి చెందగా... రోహిత్​ యాదవ్​ అపాస్మారక స్థితిలో వెళ్లాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఎస్సై మధు ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మద్యపానంతో పాటు అధిక లోడు, అతివేగమే ప్రమాదానికి కారణమని ఎస్సై తెలిపారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

ఇదీచూడండి.'ఈటీవీ భారత్'ను సందర్శించిన సూపర్​స్టార్ రజనీ

Intro:TG_KMM_12_05_ROAD;PRAMADHAMLO_EDDARU_MRUTHI_AV_TS10088_HD బ్రతుకుతెరువు కోసం రాష్ట్రం కాని రాష్ట్రానికి కుటుంబ సమేతంగా వలస వచ్చి సంతోషంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో మద్యం మహమ్మారి విషాదాన్ని నింపింది. అమ్మవారి దర్శనానికి వెళ్లిన తన భర్త విగతజీవిగా తిరిగి రావడంతో ఆ ఇల్లాలు గుండెల బద్దలయ్యాయి. భర్తతో పాటు గుమస్తా కూడా తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది . భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఓట్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అవినాష్ కుమార్ యాదవ్(28)' చందన్ యాదవ్(22) మృతిచెందగా.. రోహిత్ యాదవ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. బీహార్ నుంచి పదేళ్ల క్రితం వలస వచ్చిన ఈ కుటుంబ సభ్యులు అశ్వరావుపేట లో చిన్న వస్త్ర దుకాణాన్ని ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం దుకాణానికి సెలవు కావడంతో వినాయకపురం చిలకల గండి ముత్యాలమ్మ తల్లి ఆలయానికి పైన తెలిపిన ముగ్గురు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. అమ్మవారి దర్శనం అనంతరం అక్కడ స్నేహితుడు ఇచ్చిన విందులో మద్యం తాగారు . ఆ తరువాత వాహనంపై తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో ఊట్లపల్లి సమీపంలోని మలుపు వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో అవినాష్ కుమార్, యాదవ్ చందన్ యాదవులు అక్కడికక్కడే మృత్యువాత పడగా ..రోహిత్ యాదవ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ వార్త తెలుసుకున్న కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎస్ఐ మధు ప్రసాద్ విచారణ చేపట్టారు. మద్యం తాగి ఉండటంతో పాటు అధిక లోడు అతివేగం వలనే ఈ ప్రమాదం జరిగిందని ఎస్ఐ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అశ్వరావుపేట ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైన రోహిత్ యాదవ్ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Body:రహదారి ప్రమాదం లో ఇద్దరు మృతి

Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.