భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఆర్టీసీ కార్మికులు, సీపీఎం నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్ నుంచి బ్రిడ్జి సెంటర్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకోగా పోలీసులు కార్యాలయంలోనికి అనుమతించలేదు. కోపోద్రిక్తులైన కార్మికులు కార్యాలయం ఎదుట ధర్నాకి దిగారు.
ఆర్టీసీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలంటూ నినాదాలు చేశారు. సబ్ కలెక్టర్ని కలిసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో పోలీసులతో సీపీఎం నాయకులు వాగ్వాదానికి దిగారు. కాసేపటి తర్వాత గేటు బయటనే కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారి రామకృష్ణకు వినతి పత్రం అందించారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ ఐకాస భేటీ... భవిష్యత్ కార్యాచరణపై చర్చ