రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 43వ రోజు కొనసాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో తెల్లవారుజామునే డిపోకు చేరుకుని బస్సులు బయటకు రాకుండా కార్మికులు అడ్డుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకోగా తోపులాట జరిగి కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
ఇదీ చూడండి: అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న కండక్టర్పై 420 కేసు