ETV Bharat / state

'బొగ్గు గనుల ప్రైవేటీకరణను తెరాస వ్యతిరేకిస్తోంది' - 'బొగ్గు గనుల ప్రైవేటీకరణను తెరాస వ్యతిరేకిస్తోంది'

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు సమావేశమయ్యారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణకు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పోరాటం చేసి సింగరేణి సంస్థను కాపాడుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

telangan whip rega kantha rao pressmeet on coal mines privatization
'బొగ్గు గనుల ప్రైవేటీకరణను తెరాస వ్యతిరేకిస్తోంది'
author img

By

Published : Jun 30, 2020, 3:42 PM IST

బొగ్గు గనుల ప్రైవేటీకరణకు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పోరాటం చేసి సింగరేణి సంస్థను కాపాడుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు తెలిపారు. జులై 2 నుంచి 72 గంటల పాటు జరిగే సమ్మెకు తెరాస నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

తెరాస పార్టీ అధికారంలోకి వచ్చాకే సింగరేణి సంస్థ లాభాల్లోకి వచ్చిందని రేగా గుర్తు చేశారు. సింగరేణిలో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షురాలు కవిత అన్ని ఏరియాల్లో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక అందించారన్నారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలను తప్పకుండా తిప్పికొడతామని జులై 2న జరిగే సమ్మెలో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.