భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డిపో ఎదుట ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నిరసన తెలుపుతూ.. అస్వస్థతకు గురైన ఇద్దరు కార్మికులను భద్రాచలం సబ్ కలెక్టర్ భావేశ్ మిశ్రా పరామర్శించారు. సమ్మెలో భాగంగా నరసింహారావు, రాంబాబు ధర్నా చేస్తుండగా.. అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. చికిత్స పొందుతున్న కార్మికులను జేసీ పరామర్శించి.. పండ్లు అందజేశారు. ప్రస్తుతం కార్మికులు కోలుకుంటున్నారు.
ఇవీ చూడండి: ప్రైవేటు బస్సులకు అనుమతిని సవాల్ చేస్తూ వ్యాజ్యం