భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పెడమిడిసిలేరులో గిరిజనులు నిర్మించిన శ్రీ కోదండ రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని రామనామ స్మరణ చేశారు. వేద పండితులు ప్రత్యేక హోమాలు నిర్వహించారు.
గ్రామంలో నెలకొల్పిన ఆంజనేయుడి విగ్రహావిష్కరణ భక్తి ప్రపత్తులతో సాగింది. మహిళలు తాలిపేరు నదీ జలాలను వేడుకగా తీసుకు వచ్చి స్వామివారికి జలాభిషేకం నిర్వహించారు. జై శ్రీరామ్.. జైహనుమాన్ నామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. పూజాకార్యక్రమాల అనంతరం గ్రామంలో అన్నదానం నిర్వహించారు.
ఇదీ చూడండి: CM KCR REVIEW: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై అధికారులతో సీఎం భేటీ