కరోనా బారి నుంచి ప్రజలందరినీ రక్షించాలని సీతారామచంద్రులను కోరినట్లు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో అతి కొద్ది మందితో ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు చెప్పారు. ప్రజలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ వేడుకలను తిలకించాలని ఆయన కోరారు. మానవుడి లాగా జన్మించి... రావణాసురుడిని సంహరించి... ముల్లోకాల్లో తనకు ఎదురు లేదని నిరూపించుకున్న వ్యక్తి శ్రీరాముడని ఆలయ స్థానాచార్యుడు స్థల సాయి వివరించారు. రామునికి చేసే పట్టాభిషేకం విశేషమైనదని ఆయన పేర్కొన్నారు.
ఇవీ చూడండి: మర్కజ్ కేసుల కోసం ప్రత్యేక ప్రోటోకాల్