కరోనా పాజిటివ్ వచ్చిన మర్కజ్ కేసులన్నింటినీ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ప్రత్యేక ప్రోటోకాల్‌ను ప్రభుత్వం రూపొందించింది. గాంధీకి తరలించే క్రమంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
కరోనా నెగెటివ్ వచ్చిన వారందరినీ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రభుత్వ క్వారంటైన్‌లోనే ఉంచాలని స్పష్టం చేసింది. పరీక్షల ఫలితాలు రావాల్సిన వారందరినీ కూడా ప్రభుత్వ క్వారంటైన్‌లోనే ఉంచాలని పేర్కొంది. నెగెటివ్ వచ్చిన, ఫలితాలు రావాల్సిన వారిని ఒకే రూమ్ లేదా హాల్లో ఉంచరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి :రాష్ట్రంలో 154కు చేరిన కరోనా కేసుల సంఖ్య