కొవిడ్ నిబంధనల మధ్య భద్రాద్రి కొత్తగూడెంలో తరగతులు ప్రారంభమయ్యాయి. తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రాలు తెచ్చిన తొమ్మిది, పదో తరగతి విద్యార్థులను మాత్రమే పాఠశాలలోనికి అనుమతించారు. థర్మల్ స్కానర్లతో పరీక్షించి.. శానిటైజ్ చేసిన తర్వాత తరగతిగదుల్లోకి వెళ్లనిచ్చారు.
ఇల్లందు పట్టణంలోని జడ్పీహైస్కూలులో థర్మల్ స్కానర్ మొరాయించింది. కొంతసేపు ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు పనిచేయడం వల్ల విద్యార్థులను పరీక్షించి లోనికి అనుమతించారు. విద్యార్థులందరూ మాస్కులు ధరించి వచ్చారు. తరగతి గదిలో కొవిడ్ నిబంధనల ప్రకారం పిల్లలను కూర్చోబెట్టారు.
ఇదీ చూడండి: ఇలా ఉంటే బడి.. అస్సలు మానాలనిపించదు మరి..