భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పీవీ కాలనీలో అరుణ్ కుమార్ అనే వ్యక్తి అతిగా మద్యం సేవించాడు. ఈరోజు తెల్లవారుజామున కాలనీలో సంచరిస్తున్న కొండచిలువను చూశాడు. మద్యం మత్తులో ఆ పామును చంపేశాడు. అక్కడితే ఆగకుండా దాన్ని ఈడ్చుకుంటూ బొగ్గుగని కార్మిక సంఘం కార్యాలయం ఎదురుగా ఉన్న రోడ్డుపై పడేశాడు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి చనిపోయిన కొండచిలువపై కూర్చొని విచిత్రంగా ప్రవర్తించాడు. గమనించిన స్థానికులు ఆ వ్యక్తిని అక్కడి నుంచి తీసుకెళ్లారు.
ఇదీ చూడండి : కర్ణాటక నేతల 'ఫోన్ ట్యాపింగ్'పై సీబీఐ దర్యాప్తు