కరోనా వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాలం ద్వారా వివాహ నిశ్చితార్థ వేడుకను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నిర్వహించారు. ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, వసంత దంపతుల కుమార్తె ఆనందితను, వైరాకు చెందిన వాసిరెడ్డి రమేష్, లత దంపతుల కుమారుడు గిరిధర్‌తో వివాహం జరిపేందుకు పెద్దలు నిశ్చయించారు. నూతన దంపతులు ఇద్దరు అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. కొవిడ్ దృష్ట్యా అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు వల్ల వధూవరులిద్దరూ స్వదేశానికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా అంతర్జాలం ద్వారా వేడుకను పూర్తిచేశారు. ఆగస్టులో జరిగే వివాహాన్ని కూడా ఆన్లైన్ ద్వారానే నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇవీచూడండి: కుల వృత్తులతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం: కేటీఆర్