భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణంలో.. ఏపీ, వైజాగ్‌కు చెందిన సంతోష్ రెడ్డి గాంధీ వేషంతో పొట్ట నింపుకుంటున్నాడు. సిల్వర్ పెయింట్‌ను ఒంటికేసుకుని భగభగ మండే ఎండలో భిక్షాటన చేస్తూ భార్య, కూతుళ్లను పోషించుకుంటున్నాడు. ఉపాధి కోసం 10 సంవత్సరాల క్రితం జిల్లాకు వచ్చిన తనకు.. ప్రస్తుతం ఏ ఉపాధి లేక.. మహాత్ముడి వేషంతో బతుకుతెరువు కొసాగిస్తున్నట్లు తెలిపాడు.
సంక్షోభానికి ముందు ఓ హోటల్లో పని చేసి కుటుంబాన్ని పోషించుకునేవాడిని. లాక్డౌన్లో ఉపాధి కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. దురదృష్టవశాత్తు.. ప్రమాదంలో కాలికి గాయమైంది. చేసేదేమీ లేక.. గాంధీ వేషధారణతో భిక్షాటన చేస్తున్నాను. ఆ వచ్చే డబ్బుతో పూట గడుస్తోంది.
- సంతోష్ రెడ్డి
ఇదీ చదవండి: టీకాలు లేక నిరాశతో వెనుదిరుగుతున్న వైనం