భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ ఈవోగా జీ. నరసింహులు బాధ్యతలు చేపట్టారు. మొదటిసారిగా భద్రాచలం వచ్చిన ఈవోకు ఆలయ అర్చకులు మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈవో నరసింహులు అన్నారు. ఆదివారం కావడం వల్ల భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది.
ఇదీ చూడండి : అమ్మాయిలతో అసభ్య ప్రవర్తన... మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై కేసు