అభివృద్ధి పట్టణాల విషయంలో మంత్రి కేటీఆర్ నోట ఇల్లందు నేతల మాట వినిపించింది. ఖమ్మంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్న సందర్భంగా ప్రస్తావించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రజాప్రతినిధులు, పురపాలక ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే హరిప్రియ పనితీరును పట్టణాల విషయంలో మెచ్చుకున్నారు. ఇల్లందు పట్టణ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ అభినందించడం పట్ల పురపాలక ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : ఈ నెల 9న నేరేడ్‌మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు