అధికారుల నిర్లక్ష్యానికి భద్రాద్రి రామయ్య సన్నిధిలో దాదాపు 4,200 లడ్డూ ప్రసాదాలు బూజు పట్టి పాడయ్యాయి. శ్రీరామనవమి వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని భావించి... అధిక సంఖ్యలో ప్రసాదాలు తయారు చేశారు. కానీ కొవిడ్ కారణంగా భక్తుల దర్శనాలను నిలిపివేయగా విక్రయాలు జరగలేదు. దీంతో పాడైన లడ్డూలను అధికారులు గుట్టుచప్పుడు కాకుండా నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు.
4,200 లడ్డూలు వృథా కావడానికిి కారణమైన... రికార్డ్ అసిస్టెంట్‌పై చర్యలు ప్రారంభించారు. ప్రతిగా లక్ష రూపాయలను ఆయన నుంచి రికవరీ చేసేందుకు ఆలయ ఈవో శివాజీ మెమో జారీ చేశారు. మరికొందరు అధికారుల నిర్లక్ష్యం ఉన్నప్పటికీ ఒక్కడికే మెమో జారీ చేయడం వివాదాస్పదమైంది. ఆలయ అధికారుల మధ్య అంతర్గత విబేధాలే కారణమని సిబ్బంది ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదన్న మంత్రి ఈటల రాజేందర్