ETV Bharat / state

ఎమ్మెల్యే వనమాను అడ్డుకున్న మహిళలు - కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును మహిళలు అడ్డుకున్నారు. తమ పేర్లను జాబితా నుంచి తొలగించారంటూ నిరసన వ్యక్తం చేశారు.

Kothagudem MLA Vanama venkateswar Rao Womens blocked because of double bed room houses
ఎమ్మెల్యే వనమాకి చేదు అనుభవం
author img

By

Published : Jun 11, 2020, 10:01 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకి చేదు అనుభవం ఎదురైంది. సుజాత నగర్ మండలం​లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి వెళ్లిన ఎమ్మెల్యేను మహిళలు అడ్డుకున్నారు. లబ్ధిదారుల ఎంపిక సరిగా జరగలేదని, తమకు అన్యాయం చేశారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారిని శాంతింప చేసేందుకు శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు, అధికారులు ఎంతో శ్రమపడాల్సి వచ్చింది. నష్టోపయిన వారిని ప్రభుత్వ పథకాల్లో ఆదుకునే ప్రయత్నం చేస్తామంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.