ETV Bharat / state

నిర్మానుష్యంగా దర్శనమిస్తున్న భద్రాద్రి రామయ్య సన్నిధి - భద్రాద్రి ఆలయంలో ఆన్​లైన్​సేవలు

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ పరిసరాలు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. లాక్​డౌన్​ కారణంగా 40 రోజుల నుంచి ఆలయం మూసివేశారు. భక్తులు లేక, దుకాణాలన్నీ మూసివేశారు. దాదాపుగా రూ.5 కోట్ల నష్టం వచ్చినట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు.

heavy income loss in badrachalam  temple with lock down
నిర్మానుష్య నీడల్లో భద్రాద్రి రామయ్య సన్నిధి
author img

By

Published : May 1, 2020, 5:03 PM IST

కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం రామయ్య సన్నిధిలో... మార్చి 22 నుంచి భక్తుల దర్శనాలు నిలిపివేశారు. ఆ రోజు నుంచి ఆలయ అర్చకులు బయటకు రాకుండా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ 40 రోజుల్లో భక్తుల దర్శనాలు లేక రూ.5 కోట్ల మేర ఆదాయం పడిపోయిందని అధికారులు చెబుతున్నారు. అర్చకులు, వేద పండితులు, ఔట్​సోర్సింగ్​ సిబ్బందికి జీతాలు ఇవ్వడం కష్టంగా మారిందంటున్నారు.

ఇటీవల ఆలయంలో నిర్వహించే పూజలు, అర్చనలు, నిత్య కల్యాణాలు... భక్తులు తమ పేరు మీద జరిపించుకునేందు దేవాదాయశాఖ ఆన్​లైన్ సేవలు ప్రారంభించింది. తద్వారా భక్తులు ఎక్కడ ఉన్నా ఆన్​లైన్​లో నగదు చెల్లించి కోరిన సేవలు జరిపించుకోవచ్చు. ఇప్పటికే భారీ నష్టాన్ని చవిచూసిన భద్రాద్రి ఆలయం... లాక్​డౌన్​ ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున నష్టాల్లో కూరుకుపోయే అవకాశం కనిపిస్తోంది.

ఇదీ చూడండి: ఇద్దరి నుంచి 22 మందికి కరోనా.. అన్నీ జీహెచ్​ఎంసీలోనే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.