భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నిండుకుండలా కనబడుతోంది. రెండు రోజుల క్రితం పది అడుగుల మేర ఉన్న గోదావరి నీటిమట్టం... ఎగువ నుంచి వరద ప్రవాహం రాకతో ప్రస్తుతం ఇరవై అడుగులకు చేరింది. గోదావరమ్మ పరవళ్లు తోక్కుతు ప్రవహిస్తోంది. ఏటు చూసిన సుందర జల దృశ్యాలే కనిపిస్తున్నాయి. నది ప్రవాహం చూపరులను ఆకర్షిస్తోంది.
నదిలో ఇసుకలో తాత్కాలికంగా వేసిన పూరిగుడిసెలు నీటిలో మునిగిపోయాయి. భద్రాచలంలో స్నానఘట్టాల వరకు నీరు చేరుకుంది. గత వారం వరకు ఇసుక దిబ్బలతో ఉన్న గోదావరి నది ప్రాంతం నీటితో కళకళలాడుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తున్నందున... ఇంకా రెండు, మూడు అడుగుల వరకు నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: ప్రైవేటీకరణకు భారతీయ రైల్వే సిద్ధంగానే ఉందా?